క్రైమ్/లీగల్

దిగువ కోర్టు తీర్పుకు సమర్ధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: హర్యానాలో 70 ఏళ్ల దళితుడు, దివ్యాంగురాలైన ఆమె కుమార్తె సజీవ దహనం కేసులో దోషులైన 15 మందికి హైకోర్టులో చుక్కెదురైంది. జాట్ సామాజిక వర్గానికి చెందిన 15 మంది ముద్దాయిలు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది. హర్యానాలోని హిసార్ జిల్లా మిర్చ్‌పూర్ గ్రామంలో 2010లో ఈ హత్యలు చోటుచేసుకున్నాయి. దేశానికి స్వాంతత్య్రం వచ్చి 71 సంవత్సరాలైనా దళితులపై అకృత్యాలు జరగడం సిగ్గుచేటని న్యాయమూర్తులు ఎస్ మురళీధర్, ఐఎస్ మెహతాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
2010 నాటి ఘటనకు సంబంధించి బాధిత దళిత కుటుంబాలకు పునరావాస ఏర్పాట్లు చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టు తమపై విధించిన శిక్షను 15 మంది జాట్‌లు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. దళితులపై దాడులకు సంబంధించి ఈ కేసులో 97 మంది జాట్‌లను విచారించిన ట్రయల్ కోర్టు 15 మందిని దోషులుగా తేల్చింది. 2011 సెప్టెంబర్ 24న ట్రయల్ కోర్టు తీర్పును వెలువరించింది. మిర్చ్‌పూర్ గ్రామంలో తారాచంద్ అనే దళితుడి ఇంటికి నిప్పుపెట్టడంతో తండ్రి, కుమార్తెలు సజీవ దహనమయ్యారు. 2010 ఏప్రిల్ 21న ఈ ఘటన చోటుచేసుకుంది. కేసును విచారించిన ట్రయల్ కోర్టు కుల్వీందర్, ధరమ్‌వీర్, రాంఫాల్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. బల్జీత్, కరమ్‌వీర్, కరమ్‌పాల్, ధరమ్‌వీర్, బోబల్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. మరో ఏడుగురికి వివిధ సెక్షన్ల కింద కోర్టు జైలు శిక్ష విధించింది.