క్రైమ్/లీగల్

సుప్రీం ప్రత్యక్ష ప్రసారాల తీర్పు రిజర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి దాఖలైన కేసులో తీర్పును సుప్రీం రిజర్వ్‌లో పెట్టింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారధ్యంలో జస్టిస్ ఎంఏ ఖాన్వీకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు సంబంధిత పిటిషన్లను విచారించింది. ప్రధాన న్యాయమూర్తి కోర్టు నుంచి ప్రాధాన్యత కేసులు ప్రత్యక్ష ప్రసారం ప్రయోగాత్మకంగా చేపట్టాలన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సూచనపై బెంచ్ స్పందించింది. తగిన సమయంలో దీనిపై ఆదేశాలిస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. పైలెట్ బేసిస్‌పై ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభించాక, విజయవంతమైతే మిగతా కోర్టులకు అమలు చేయాలని అటార్నీ జనరల్ చెప్పారు. విచారణ సందర్భంగా కోర్టు హాలులోనే ఉన్న న్యాయవాదుల్లో ఒకరు లేచి ప్రత్యక్ష ప్రసారాల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది వక్రమార్గం పడుతుందని, అసత్య, నకిలీ వార్తలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రత్యక్ష ప్రసారాల ఉద్దేశాన్ని బెంచ్ స్పష్టం చేసింది. ‘కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులును తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఓపెన్ కోర్టుల భావన ఉద్భవించింది. ఒక విధంగా ఇది మంచిదే. కోర్టుల్లో రద్దీని తగ్గించేందుకు ఓపెన్ కోర్టుల పద్దతి సహకరిస్తుంది’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యక్ష ప్రసారాల కూడా ‘అకడమిక్ పర్‌పస్’కు ఉపయోగపడతాయని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీం కోర్టులో విచారణ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం చేయాలని లా విద్యార్థి ఒకరు సుప్రీంలో పిటిషన్ వేశారు. న్యాయవిద్యా బోధనకు ఇది ఉపకరిస్తుందని జోధ్‌పూర్ నేషనల్ లా యూనివర్శిటీ విద్యార్థి స్వాప్నిల్ త్రిపాఠి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని కోర్టును అభ్యర్థించారు. దేశంలో ప్రాముఖ్యత గల కేసుల వీడియో రికార్డింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ మరో పిల్ దాఖలు చేశారు. త్రిపాఠి, జైసింగ్‌తోపాటు సెంటర్ ఫర్ అకౌండబిలిటీ అండ్ సిస్టమిక్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున విరాగ్ గుప్తా మరో పిటిషన్ దాఖలు చేశారు. కేసుల విచారణకు సంబంధించి వీడియా చిత్రీకరణ ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీం రిజిస్ట్రీ, న్యాయ మంత్రిత్వశాఖ, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను ఆదేశించాలని ఎన్‌జీవో కోరింది.