క్రైమ్/లీగల్

ఓటర్ కార్డులో ఏనుగు, జింక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బల్లియా (యూపీ), ఆగస్టు 25: యూపీ ఓటర్ల జాబితాలో వింతలు విడ్డూరాలు చోటు చేసుకున్నాయి. కాని ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమై తప్పులను సరిదిద్దే ప్రక్రియను చేపట్టారు. వచ్చే ఏడాది 2019 ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రూపొందిస్తోంది. బల్లియా నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది. దుర్గావతి అనే మహిళా ఓటరు పేరు ఉన్న చోట సినీ నటుడు సన్నీ లియాన్ ఫోటో ముద్రితమైంది. ఇంతటితో తప్పులు ఆగలేదు. కొంత మంది పేర్లు ఉన్న చోటు వారి ఫోటోలు కాకుండా, ఆ స్థానంలో జంతువుల ఫోటోలు ముద్రితమయ్యాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్ల ఈ తప్పులు జరిగాయని ఎన్నికలసంఘం అధికారులు చెప్పారు. కున్వర్ అంకుర్ సింగ్ పేరున్న చోట జింక ఫోటో ఉంది. కున్వర్ గౌరవ్ సింగ్ ఫోటో స్థానంలో నెమలి ఫోటో ప్రచురితమైంది. నారద్ రాయ్ అనే పేరు ఉన్న చోట ఆయన ఫోటో కాకుండా ఏనుగు ఫోటో ముద్రితమైంది. నారద్ రాయ్ మాజీ మంత్రి. గతంలో ములాయం, అఖిలేష్ సింగ్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఇదంతా ఎన్నికల సంఘం కార్యాలయంలో డేటా ఆపరేటర్, ఒక గుమాస్తా మధ్య తలెత్తిన గొడవల వల్ల చోటు చేసుకుంది. దీనిపై అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ముకుల్ కుమార్ సింఘాల్ విచారణ చేశారు. కాగా ఈ అంశంపై కేసు నమోదు చేసినట్లు బల్లియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీపర్న గంగూలీ చెప్పారు. బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు.