క్రైమ్/లీగల్

బిడ్డను కడతేర్చిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్ల, ఆగస్టు 25: అందరితో సరదాగా ఆడుకుంటూ ఇపుడిప్పుడే అడుగులువేస్తున్న చిన్నారి పాపపై కన్నతండ్రే కాలయముడుగా మారాడు. విజయనగరం జిల్లా, గుర్ల మండలం గరికివలస గ్రామంలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బిడ్డ ఆవాల సుమలత(3)ను తండ్రి శ్రీనివాసరావు గొంతుకోసి హత్యచేశాడు. శ్రీనివాసరావుకు కెంగువ గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు ఇచ్చాడు. తర్వాత కరవచెర్ల గ్రామానికి చెందిన ఆదిలక్ష్మిని వివాహం చేసుకుని నాలుగేళ్ళయింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలై, దూరంగా ఉంటున్నారు. పెద్దలు రాజీ చేసి నెల రోజుల కిందట అత్తవారింటికి ఆమెను పంపించారు. అయినా వారిమధ్య గొడవలు సమసిపోలేదు. భార్య వేకువజామున బహిర్భూమికి వెళ్ళిన సమయంలో శ్రీనివాసరావు కుమార్తెను హతమార్చాడు.