క్రైమ్/లీగల్

పంట కాలువలోకి దూసుకుపోయిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, ఆగస్టు 25: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో జరిగిన ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్‌ఐ వంశీధర్ (33) గల్లంతయ్యారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు గాను తన తల్లితో కలిసి కోడూరు మండలం ఇస్మాయిల్‌బేగ్‌పేట వెళుతున్న ఎస్‌ఐ కోట వంశీధర్ కారు అదుపు తప్పి పంట కాలువలో దూసుకుపోయింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో తల్లి లక్ష్మి ప్రాణాలతో బయట పడగా ఎస్‌ఐ వంశీధర్ గల్లంతయ్యారు. ఇస్మాయిల్‌బేగ్‌పేటకు చెందిన అవివాహితుడైన వంశీధర్ 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐ. ప్రస్తుతం రామచంద్రపురం ఎస్‌ఐగా పని చేస్తున్న వంశీధర్ శనివారం తన స్వగ్రామంలో జరగనున్న వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తన తల్లితో కలిసి కారులో కరకట్ట మీదుగా వెళుతున్నారు. ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే తల్లీ కొడుకులు ఇద్దరూ సురక్షితంగా బయట పడినప్పటికీ కారులో ఉన్న బ్యాగ్ కోసం ఎస్‌ఐ వంశీధర్ నీటి ముంపులో ఉన్న కారు వద్దకు వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీటి ముంపులో ఉన్న కారు వద్దకు వెళ్లిన ఎస్‌ఐ ఆ ప్రవాహానికి నీటిలో ఉక్కిరిబిక్కిరయ్యాడు. స్థానికులు నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఎస్‌ఐని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. తాడు సాయంతో ఎస్‌ఐని బయటకు తీసుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో ఎస్‌ఐ గల్లంతయ్యారు. అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు నేతృత్వంలో చల్లపల్లి సీఐ జనార్ధన్, సబ్ డివిజన్‌లోని పలువురు ఎస్‌ఐలు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విజయవాడ నుండి ప్రత్యేక బృందాలను రప్పించి బోట్ల ద్వారా పంట కాలువ వెంబడి గాలించారు. అతి కష్టం మీద కారును బయటకు తీసుకు వచ్చారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో గాలింపు చర్యలు కొనసాగినా ఎస్‌ఐ ఆచూకీ లభ్యం కాలేదు.

చిత్రం..కారును ఒడ్డుకు తీసుకు వస్తున్న దృశ్యం
*ఎస్‌ఐ వంశీధర్ (ఫైల్‌పొటో)