క్రైమ్/లీగల్

అరెస్టుల్లోనూ హైడ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, ఆగస్టు 26 : సర్వే బృందంపై దాడి చేశారన్న ఫిర్యాదుపై స్థానిక వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌తోపాటు మరో 10 మందిపై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే నవీన్‌నిశ్చల్ అజ్ఞాతంలో ఉండగా ఆయన కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం కేసులో పేర్లు ఉన్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే ఆయా వైకాపా నాయకులను పోలీసులు కోర్టుకు హాజరు పరచకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల్లోపు నిందితులను కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఇలాంటి విధానాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. కాగా వైకాపా నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారన్న విషయమై స్థానిక నాయకులతో చర్చించేందుకు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి నదీం అహ్మద్, కదిరి, రాప్తాడు, పుట్టపర్తి నియోజకవర్గాల సమన్వయ కర్తలు సిద్ధారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీ్ధర్‌రెడ్డి ఆదివారం సాయంత్రం పట్టణానికి చేరుకున్నారు. పాత్రికేయుల సమావేశం అనంతరం పోలీసులు అదుపులో ఉన్న నాయకులను పరామర్శించేందుకు వైకాపా నేతలు స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు ఉన్నఫళంగా హడావుడి చేస్తూ కోర్టుకు తీసుకెళ్లాలని అదుపులో ఉన్న ఆరుగురిని జీపులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అలా కోర్టుకు తీసుకెళ్లకుండా పోలీసులు ప్రభుత్వాసుపత్రి ఆవరణలోకి తీసుకెళ్లి వాహనాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం. ఉద్దేశ పూర్వకంగానే పోలీసుల అదుపులో ఉన్న నాయకులు వైకాపా నేతలను కలువనివ్వకుండా వ్యవహరించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చివరకు వైకాపా నేతలు ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణను కలిసి కేసు నమోదు తదితర అంశాలపై చర్చించారు. కాగా అరెస్టు విషయమై స్థానిక టూటౌన్ సీఐ తమీమ్ అహ్మద్‌ను అడగ్గా ఆదివారం సాయంత్రం కేసులో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని, తమకు ఇంకా కోర్టులో హాజరు పరిచేందుకు సమయం ఉందన్నారు.