క్రైమ్/లీగల్

బ్లాక్‌మెయల్‌కు పాల్పడుతున్న ముగ్గురు పాత్రికేయుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 26: ఒంటరిగా నివసిస్తున్న ఓ వృద్ధ ఆక్వా రైతుకు మాయమాటలు చెప్పి, అతను హోమోసెక్స్‌కు పాల్పడుతున్నట్టు చిత్రీకరించి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందిగా బ్లాక్‌మెయిల్ చేసిన ముగ్గురు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసులు శనివారం రాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులను ఆదివారం మచిలీపట్నం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి 14రోజులు రిమాండ్ విధించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మరో వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన ఓ ఆక్వా రైతు ఒంటరిగా నివసిస్తున్నాడు. మచిలీపట్నంలో రెండు చానల్స్‌కు చెందిన విలేఖరులు మోటేపల్లి వెంకటేశ్వరరావు, కొనకళ్ల గిరిబాబు, మొవ్వ మండలం కాజ గ్రామానికి చెందిన అంకాలరావు రొయ్యపిల్లలు కావాలంటూ ఈ నెల 21న ఆక్వా రైతు ఇంటికి వెళ్లారు. తాను రొయ్యపిల్లల వ్యాపారం చేయడం లేదని ఆయన చెప్పాడు. కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి రైతు ఇంట్లోకి వెళ్లిన అంకాలరావు తనంతట తాను వివస్త్రుడిగా మారి వెంటనే రైతు దుస్తులు కూడా లాగేశాడు. దీన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో చిత్రీకరించి రైతును బ్లాక్‌మెయిల్ చేశారు. 10లక్షల రూపాయలిస్తేనే ఈ వీడియోలు ఇస్తామని, లేకుంటే యూట్యూబ్‌లో పెడతామని అతన్ని బెదిరించారు. దీంతో ఏంచేయాలో పాలుపోని రైతు ఏడు నవర్సుల తన చేతి బ్రాస్‌లెట్, వజ్రాల ఉంగరాన్ని వారికిచ్చారు. వీటిని తీసుకొని అక్కడి నుండి ఉడాయించిన ముగ్గురు రూ. 10లక్షలు ఇవ్వాల్సిందేనంటూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంకటేశ్వరరావు, గిరిబాబు విజయవాడకు చెందిన మరో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు ఏడుకొండలుతో కలిసి మంగళాపురం గ్రామానికి వచ్చి రైతును మరింత భయభ్రాంతులకు గురిచేశారు. తనకు కొంత సమయం ఇవ్వాలని రైతు కోరటంతో వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. బాధితుడు చేసేదిలేక చల్లపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్‌కు ఫిర్యాదు చేశాడు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ జనార్ధన్ ప్రత్యేక బృందాన్ని నియమించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ముగ్గురినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుల నుండి సెల్‌ఫోన్‌లు, రైతుకు చెందిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఆదివారం ఉదయం మచిలీపట్నం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి 14రోజులు రిమాండ్ విధించారు. ఈ కేసులో కీలకంగా మారిన అంకాలరావును అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు.

చిత్రం..అరెస్ట్ చేసిన జర్నలిస్టులను రిమాండ్‌కు తరలిస్తున్న పోలీసులు