క్రైమ్/లీగల్

హైదరాబాద్ పేలుళ్లపై తీర్పు నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఉగ్రవాదుల టిన్ బాంబు జంట పేలుళ్ల కేసులో తీర్పు సోమవారం వెలువడనుంది. పదకొండేళ్ల క్రితం సచివాలయం సమీపంలోని లుంబినీ పార్కుతోపాటు కోఠీలోని గోకుల్‌చాట్ వద్ద జరిగిన పేలుళ్లకు సంబంధించి సోమవారం ఏన్‌ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనున్నది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇండియన్ ముజాయిద్దీన్ చెందిన వీరు పేలుళ్లకు కుట్ర చేశారని అభియోగం. 2007 ఆగస్టు 25న జరిగిన పేలుళ్ల సంఘటనలో 42 మంది మృతిచెందగా, 52 మంది క్షతగాత్రులయ్యారు. ఆ రోజు రాత్రి 7.45 గంటల సమయంలో లుంబినీ పార్కు, 7.50 గంటలకు గోకుల్ చాట్ వద్ద ఉగ్రవాదులు టిన్ బాంబు పేలుళ్లుకు పాల్పడడం సంచలనం సృష్టించింది. పేలుళ్ల బాధితులకు పరిహారం చేల్లిస్తామని ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, అయితే ఇప్పటివరకు పరిహారం అందలేదని బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు. ఈ పేలుళ్లు జరిగినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నారు.