క్రైమ్/లీగల్

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, ఆగస్టు 26: భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ తల్లి, ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. పది సంవత్సరాలుగా అన్యోన్యంగా సాగిన వారి జీవితం మనస్పర్థల కారణంగా వారి కుటుంబం చిన్నాభిన్నమైంది. భర్తతో గొడవపడి ఎనిమిదేళ్ల లోపు వయస్సు గల ఇద్దరు కుమారులను వెంటేసుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జిల్లా కేంద్రమైన జనగామలో చోటుచేసుకుంది. జనగామ రైల్వే పోలీసులు, మృతురాలి బంధువుల వివరాల ప్రకారం... స్థానిక వీవర్స్‌కాలనీకి చెందిన మాదాసు మధుకర్‌కు మోత్కూరు మండల కేంద్రానికి చెందిన మధులతకు పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం చేసుకున్న మూడేళ్లకే పెద్దకుమారుడు, మరో మూడేళ్లకు చిన్నకుమారుడు జన్మించారు. మధుకర్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ వీవర్స్‌కాలనీకి చెందిన వీరు కొన్నిసంవత్సరాలుగా జనగామ రెడ్డీకాలనీలో కిరాయికి ఉంటూ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. మధులత రాఖీ పౌర్ణమిరోజు తమ తల్లిగారింటికి వెళ్తానని భర్తతో గొడవపడిందని తెలిపారు. ఈ విషయంలో భర్త మధుకర్ నీ ఇష్టం ప్రకారమే తల్లిగారింటికి వెళ్లిరా అని అనగా ఆమె కోపంతో ఇద్దరు పిల్లలు ఉదయ్ (7), వినయ్ (4)లను వెంటేసుకొని బయల్దేరింది. ఆమె తల్లిగారి గ్రామానికి వెళ్లిందని అందరూ అనుకొన్నారు. కానీ ఆ ఇద్దరు పిల్లలను తీసుకొని జనగామ అంబేద్కర్‌నగర్ సమీపంలో ఓ రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణాన్ని రెండుగంటల అనంతరం చూసిన స్థానికులు జనగామ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను గుర్తించి బంధువులకు తెలియచేశారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.
భర్త, ఇద్దరు పిల్లలతో మధులత (ఫైల్ ఫొటో)