క్రైమ్/లీగల్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడుతున్న వీఐపీ వారసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఆగస్టు 26: నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పలువురు ఉన్నతాధికారుల పిల్లలు పట్టుపడుతుండటం కలవరం కలిగిస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మోతాదుకు మించిన మద్యం సేవించి వాహనం నడుపుతున్న 123 మందిపై కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేశారు. పోలీసుల తనిఖీలో పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ ఉన్నతాధికారి కుమార్తె పట్టుబడ్డారు. ఆమె శ్వాస పరీక్షలకు నిరాకరించి హల్‌చల్ చేశారు. జుబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెల్లడైంది. ఇటీవల మరో కేసులో అల్వాల్‌లో వుంటున్న మరో ఉన్నత స్థానంలో వున్న కుమార్తె పట్టుబడగా అప్పట్లో సంచలనం కలిగించింది. తాజాగా పట్టబడ్డ యువతి ఉంటూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు చాలామంది ఉన్నతాధికారుల పిల్లలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుపడడం శోఛనీయమని పలువురు చెబుతున్నారు.