క్రైమ్/లీగల్

దాచేపల్లిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి, ఆగస్టు 31: దాచేపల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న మందపాటి నరసింహారావును అరెస్ట్‌చేసి అతని వద్ద నుండి భారిగా రు.4.90,000లు, ఆరు బియ్యం బస్తాలు, స్విఫ్ట్ డిజైర్ కారుని స్వాధీనం చేసుకున్నట్లు దాచేపల్లి ఎస్‌ఐ మహ్మద్ రఫీ శుక్రవారం తెలిపారు. దాచేపల్లి పోలీసు స్టేషన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నరసింహారావు కొద్ది సంవత్సరాలుగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని చెప్పారు. గతంలో కూడా ఇతనిపై అక్రమ బియ్యం రవాణాపై పలు కేసులు నమోదై వున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఇతనిని పలుమార్లు హెచ్చరించినప్పటికీ తన పద్ధతిని మార్చుకోలేదన్నారు. కాగా శుక్రవారం స్విఫ్ట్ డిజైర్ కారులో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా తక్కెళ్ళపాడు సమీపంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందుతుడి వద్దనుండి 4,90,000 నగదు, ఆరు బస్తాల రేషన్ బియ్యం, షిప్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహ్మద్ రఫీ తెలియజేశారు.

గ్యాస్ లీకై హోటల్ దగ్ధం
నూజెండ్ల, ఆగస్టు 31: గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఎగిసిపడి ఓ హోటల్ దగ్ధమైన సంఘటన మండల కేంద్రమైన నూజెండ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన సెంటర్లో లక్ష్మీ అనే మహిళ హోటల్ నడుపుతోంది. రోజు మాదిరిగానే వంట చేసేందుకు సిద్ధమైంది. ఇంతలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హోటల్ ఉన్న రెండు సిలిండర్లను బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. హోటల్‌లోని వస్తువులతో పాటు 25వేల రూపాయలు, విలువైన ధృవపత్రాలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు హోటల్ నిర్వహకురాలు లక్ష్మి వాపోయింది. సకాలంలో మంటలను అదుపు చేయడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.