క్రైమ్/లీగల్

జంట పేలుళ్ల కేసు నేడు తుది తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌ఛాట్, లుంబినీ పార్కు జంట బాంబు పేలుళ్ళ కేసుపై మంగళవారం తీర్పు వెలువడనున్నది. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న నిందితులను సెషన్స్ జడ్జి శ్రీనివాస రావు చర్లపల్లి జైలు ప్రత్యేక కోర్టులో విచారించిన సంగతి తెలిసిందే. కాగా, రిజర్వ్‌లో ఉన్న తీర్పును మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. పెలుళ్ళ కేసుతో సంబంధం ఉన్న ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అనీఖ్ షఫీక్ సయ్యద్, మహ్మద్ సాదిక్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సర్ అహ్మద్ షేక్‌ను 2008 సంవత్సరంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం ప్రత్యేక స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం దీనిపై తెలంగాణ పోలీసు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కేసును దర్యాప్తు నిర్వహించింది. 2007 ఆగస్టు 25న జరిగిన ఈ పేలుళ్ళతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 25వ తేదీతో ఘటన జరిగి 11 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ కేసులో సుమారు 170 మంది సాక్ష్యులను విచారించారు.