క్రైమ్/లీగల్

లోయలో పడ్డ వ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: ఉత్తరాఖంఢ్‌లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ 200 మీటర్ల లోయలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. కొండ చరియలే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గంగోత్రి నుంచి 15 మందితో తిరిగి వస్తున్న టేంపోట్రావెలర్ షంగ్లై వద్ద లోయలోకి బోల్తాపడిందని విపత్తుల సన్నద్ధత అధికారి దేవేంద్ర పట్వాల్ వెల్లడించారు. రహదారి అంతటా కొండ చరియలు పడిఉండంతో వాహనం అదుపుతప్పింది. డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోవడంతో లోయలో పడిపోయింది. 13 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం జరిగింది. హెలీకాప్టర్‌ను రంగంలోకి దించేందుకు వీలులేకపోవడంతో క్షతగాత్రులను అంబులెన్స్‌లోనే డెహ్రడూన్ ఆసుపత్రికి తరలించారు.