క్రైమ్/లీగల్

హత్యకేసులో ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఫిబ్రవరి 25: ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టుచేసినట్లు మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి వెల్లడించారు. వివరాలు ఇలావున్నాయి... మదనపల్లె పట్టణంలోని సుభాష్‌రోడ్డుకు చెందిన ఉదయ్‌కుమార్, సయ్యద్ ఇర్ఫాన్, అన్న సయ్యద్ నోమన్‌లు బెంగళూరు నగరంలోని చిరంజీవి అనే వ్యక్తివద్ద పీఓపీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. చిరంజీవి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం మదనపల్లె పట్టణంలో ఎవరికీ చెప్పవద్దని నోమన్, సోహెల్ అనే యువకులకు చిరంజీవి చెప్పాడు. ఇదిలావుండగా కె.దినేష్‌కుమార్, ఉదయ్‌కుమార్, సయ్యద్ నోమన్, సయ్యద్ ఇర్భాన్‌లు మంచి స్నేహితులు. గత పదిరోజుల క్రితం నలుగురు మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. దీంతో దినేష్‌కుమార్ తాగిన మైకంలో అర్ధరాత్రి తన స్నేహితులైన సయ్యద్‌నోమన్, ఇర్ఫాన్ ఇళ్ల వద్దకు వెళ్లి అసభ్య పదజాలంతో దూషించాడు. ఇలా రెండురోజులు దూషించడంతో నోమన్, ఇర్ఫాన్, ఉదయ్‌కుమార్‌లు పథకం వేసుకుని ఈనెల 16న శుక్రవారం రాత్రి దినేష్‌కుమార్‌ను వెంటపెట్టుకుని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని వెంకటేశ్వర లాడ్జీకి వెళ్లారు. నలుగురు మద్యం సేవించారు. అందులో దినేష్‌కుమార్‌కు ఎక్కువ మద్యం సేవించేలా చేశారు. మద్యం సేవించి లాడ్జీ గేటుముందు ఇర్ఫాన్, దినేష్‌కుమార్ మాట్లాడుకుంటుండగా ఉదయ్‌కుమార్ తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో దినేష్‌కుమార్‌ని రెండుమార్లు నరకడంతో కుప్పకూలిపోయాడు. హత్యచేసిన ముగ్గురు పరారై.. ఈనెల 24న శనివారం సాయంత్రం మదనపల్లె - పుంగనూరురోడ్డులోని కనుమలో గంగమ్మ ఆలయం వద్ద ఉండగా టూటౌన్ సీఐ సురేష్‌కుమార్ వారిని అరెస్టుచేసి, వారి వద్ద ఉన్న కొమ్ముకత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మదనపల్లె పోలీస్ సబ్‌డివిజన్‌లో ఎవరైనా అకతాయితనంగా తాగి, గొడవలు చేసినా, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కేసులు నమోదుచేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ చిదానందరెడ్డి హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన సిఐ సురేష్‌కుమార్, కానిస్టేబుల్ రాజేష్‌ను డీఎస్పీ అభినందించారు.