క్రైమ్/లీగల్

ఇద్దరు దోషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ లుంబినీ, గోకుల్‌చాట్ పేలుళ్ల కేసులో ఇద్దర్ని దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును ఈ నెల 10వ తేదీన ప్రకటించనున్నట్టు ఏన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం వెల్లడించింది. శిక్షలూ ఆ రోజే ఖరారు చేస్తారు. పేలుళ్లకు ఇండియన్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులే కారణమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ముగ్గురిన్ని ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ విషయాలను ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి జైలు వెలుపల ప్రభుత్వ న్యాయవాది మీడియాకు వెల్లడించారు. కేసుకు సంబంధించి మొత్తం 170 మంది సాక్షులను ప్రశ్నించినట్లు చెప్పారు. టిన్ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనిఖ్ షఫిక్ సయ్యద్‌లను దోషులుగా నిర్ధారించినట్టు ఆయన తెలిపారు. వారిపై 302 సెక్షన్ కింద అభియోగాలు ఉన్నాయన్నారు. సాదిక్ ఆష్రార్‌పేక్, పారుఖ్ సర్ఫుద్దీన్, తర్ఖాషలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా ఎన్‌ఐఏ కేసులను నమోదు చేసింది. అందులో అమీర్ రాజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నరు. కోర్టు తీర్పు సందర్భంగా
చర్లపల్లి జైలు వద్ద అంత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులతో పాటు ఎవర్నీ జైలు సమీపంలోకి వెళ్లనీయలేదు. 2007 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లుంబినీ పార్కు వద్ద సాయంత్రం 7.45 నిమిషాలకు, మరో ఐదు నిమిషాల్లో గోకుల్‌చాట్ వద్ద టిన్ బాంబులను ఉగ్రవాదులు పేల్చారు. ఈ పేలుళ్లలో 42 మృతి చెందారు. 62 మంది క్షతగాత్రులు అయ్యారు. బాంబు పేలుళ్ల సంఘటన తర్వాత పరారీలో ఉన్న ఉగ్రవాదులను మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు బృందాలకు దొరిగిపోయారు. వారిని గుజరాత్ పోలీసులకు అప్పజెప్పారు. అనంతరం ఉగ్రవాదులను ఉమ్మడి రాష్ట్ర పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. కేసు విచారణలో పేలుళ్లకు పాల్పడింది తామేనని ఒప్పకున్నట్టు తెలిసింది. కోర్టు తీర్పు వెలువడుతుందని తెలిసి పేలుళ్ల బాధితులు జైలు వద్దకు చేరుకున్నారు.