క్రైమ్/లీగల్

హాపూర్ మూకదాడి కేసు విచారణ జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో జరిగిన మూకదాడి కేసులో విచారణ జరపాలని మీరట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో, ఏఎం ఖన్వీల్కర్, డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నది. ఉత్తరప్రదేశ్ సమర్పించిన నివేదికపై బుధవారం కోర్టు స్పందిస్తూ సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఐజీపీని ఆదేశిస్తూ, కేసును రెండు వారాలు వాయిదా వేసింది. గోవధ నిషేధ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, వాటిని హతమారుస్తున్నారన్న ఆరోపణలపై ఈ ఏడాది జూన్ 18న హోపూర్‌లో మూకదాడి జరిగింది. ఈ సంఘటనలో 45 ఏళ్ల ఖాసిం ఖురేషి మృతి చెందగా, సమీలుద్దీన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఈ కేసును విచారనకు స్వీకరించినప్పుడు సుప్రీం కోర్టు మూక దాడులపై తీవ్రంగా స్పందంచింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారిని ఉపేక్షించరాదని స్పష్టం చేసింది. సంఘటనపై నివేదికను కోరింది. కాగా, సుప్రీం ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ సర్కారు అఫిడవిట్‌ను సమర్పించింది. సంఘటన నేపథ్యంలో హోపూర్ ఎస్‌హెచ్‌ఓను బదిలీ చేసినట్టు తెలిపింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపిస్తున్నట్టు వివరించింది. యూపీ సర్కారు వివరణను విన్న అనంతరం, ఈ సంఘటనపై విచారణ జరపి, నివేదక ఇవ్వాలని మీరట్ ఐజీపీని ఆదేశించింది. తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న బాధితుడు సమీలుద్దీన్ నుంచి వాగ్మూలం తీసుకోవాలని సూచించింది.