క్రైమ్/లీగల్

బాలుడి హత్య కేసులో ముగ్గురికి మరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా: నాలుగేళ్ల బాలుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేసి కొట్టి హింసించి, అతనికి బలవంతంగా మద్యం తాగించి, రాయి కట్టి ట్యాంకులోకి తోసి కిరాతకంగా చంపిన కేసులో ముగ్గురికి మరణ శిక్ష విధిస్తూ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. బాలుడి హత్యకేసును విచారించిన సెషన్స్ జడ్జి వీరేందర్ సింగ్ నిందితులు చందర్ శర్మ, తేజేందర్ సింగ్, విక్రాంత్ భక్షిలను దోషులుగా నిర్ధారిస్తూ వారికి మరణశిక్షే సరైన శిక్షగా పేర్కొంటూ తీర్పు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వినోద్‌కుమార్ గుప్తా కుమారుడు యుగ్ (4) జూన్ 14, 2014న హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో నిత్యం రద్దీగా ఉండే రామ్‌బజార్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. తర్వాత ఏడురోజుల తర్వాత అతడిని కిడ్నాప్ చేశామంటూ ఒక బెదిరింపు కాల్ వచ్చింది. తర్వాత ఆ బాలుడిని హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే అతని మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత జనవరి 16, 2016న కొందరు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి దిగగా, అందులో ఒక అస్థిపంజరం లభ్యమైంది. అది కిడ్నాపైన బాలుడిదిగా గుర్తించారు. ఈ హత్య రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. బాలుడి హత్య ఉదంతాన్ని నిరసిస్తూ పలువురు ర్యాలీలు, క్యాండిల్ ర్యాలీలు చేపట్టారు. దీంతో కేసును సీఐడీకి అప్పగించగా, జూన్ 16న దీనిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. బాలుడిని విడిపించాలంటే తమకు 3.6 కోట్లు చెల్లించాలంటూ కిడ్నాపర్లు డిమాండ్ చేస్తూ రాసిన లేఖను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మరో మూడు ఇలాంటి లేఖలను అధికారులు కనుగొన్నారు. కేసును విచారించిన సీఐడీ అధికారులు ముగ్గురు నిందితులు ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులు తర్వాత బాలుడిని హింసించి, తర్వాత బలవంతంగా మద్యం తాగించి ఒక బరువైన రాయిని కట్టి అతడిని నీటి ట్యాంకులోకి తోసి హత్య చేశారని నిర్ధారించారు. నిందితులపై 302, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సిమ్లా కోర్టులో హాజరుపర్చగా 105 మంది సాక్షులను విచారించిన కోర్టు వీరు ఈ హత్యకు పాల్పడినట్టు నిర్ధారించి మరణ శిక్షను విధించింది.