క్రైమ్/లీగల్

హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 12: ఇల్లు ఖాళీ చేయమన్న పాపానికి ఇంటి యజమానిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు బుధవారం తీర్పు చెప్పారు. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ మెకానిక్‌గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్ పొందిన దాసరి సాంబ శివరావు (62) ఈడేపల్లిలోని పెంతికోస్తు ప్రార్థనా మందిరం ఎదురుగా తన స్వగృహంలో ఒంటరిగా ఉంటున్నాడు. సాంబ శివరావు తన ఇంటి ఆవరణలోనే ఉన్న రేకుల షెడ్డును రేకపల్లి నాగ సత్య శ్రీనివాస్‌కు అద్దెకు ఇచ్చాడు. శ్రీనివాస్‌కు దుర అలవాట్లు ఉండటంతో ఇల్లు ఖాళీ చేయాలని సాంబశివరావు ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొంది. కోపోద్రిక్తుడైన నాగ సత్య శ్రీనివాస్ 2015 జనవరి 26వతేదీ అర్ధరాత్రి తన స్నేహితుడైన యలవర్తి సుమన్‌తో కలిసి సాంబశివరావు గొంతును టవల్‌తో నులిమి హత్య చేశారు. దీనిపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించారు. నిందితులు ఇరువురిని అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కైలా రామకృష్ణ 12 మంది సాక్షులను విచారించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగ సత్య శ్రీనివాస్ కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. రెండవ నిందితుడైన సుమన్‌పై మోపిన నేరం ఋజువు కావటంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు పైన తెలిపిన శిక్షను విధించారు. ఈ కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసులను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అభినందించారు.