క్రైమ్/లీగల్

టీటీఈపై ప్రయాణీకుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 15: ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి యువకుడు మృతిచెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలిస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్ తాండకు చెందిన శివ(24) పాండ్యనాయక్, పద్మమ్మల కొడుకు. ఇటీవలే ఎస్‌ఏపీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆదివారం వీఆర్‌వో పరీక్ష సైతం రాయాల్సి ఉంది. పెయింటింగ్ పనిచేసే శివ శనివారం ఉదయం తాండూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే డెమో రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు నవాబ్‌పేట మండలం గొల్లగూడ స్టేషన్‌కు వచ్చే సమయంలో టీటీఈ తనిఖీకి వచ్చాడు. అదే సమయంలో శివ ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి మృతిచెందాడు. శివ మృతికి టీటీఈ కారణమంటూ తోటి ప్రయాణీకులు చితకబాదారు.