క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, సెప్టెంబర్ 15: అప్పుల బాధతో ఓ రైతు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని వెంకటాపూర్(బీజీ) గ్రామంలో శనివారం జర్గింది. ఈ సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గౌడ నర్సయ్య(35) అనే రైతు తన కున్న కొద్ది పాటి వ్యవసాయ భూమితో పాటు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ధ నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకోని మొక్క జోన్న, ప్రత్తి పంటలు సాగు చేసినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో పంటల పెట్టుబడులతో పాటు కుటుంబ అవసరాల నిమిత్తం వడ్డి వ్యాపారుల వద్ధ రూ. 2లక్షల వరకు అప్పులు చేసినట్లు చెప్పారు. తీవ్ర వర్షాభావంతో వేసిన పంటలు ఎండిపోతున్న క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో మానసిక వేదనకు గురై ఆ రైతు శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శవ పంచనమా అనంతరం పోస్టు మార్టం నిమిత్తం మృత దేహన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు ధర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అప్పుల బాధతో ఆత్మ హత్యకు పాల్పడిన గౌడ నర్సయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటేరు శ్రీనివాస్‌రెడ్డి శనివారం గ్రామానికి చేరుకోని పరామర్శించారు. మృతుని భార్య అరుణకు రూ. 5వేలు ఆర్థిక సహాయం అందజేశారు.