క్రైమ్/లీగల్

అమరావతి వద్ద కృష్ణానదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 15: అమరావతి వద్ద శనివారం మధ్యాహ్నం గోపాల్‌నగర్‌లో ఏర్పాటుచేసిన అనధికార వినాయకుని బొమ్మను అమరావతి పురవీధుల్లో ఊరేగింపు చేసి అగ్రికల్చరల్ ఫారం సమీపంలో ఉన్న ఇసుక ర్యాంప్ వద్ద నిమజ్జనం చేసేందుకు వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు స్థానిక గోపాల్‌నగర్‌కు చెందిన మర్రి వెంకటేష్ (18), పేరుబోయిన ఏసుబాబు (18) నీటమునిగి కొట్టుకుపోయారు. మర్రి వెంకటేష్ నారాయణ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. పేరుబోయిన ఏసుబాబు మోతడక చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే తహశీల్దార్ భాస్కరరావు, సిఐ కె ప్రభాకర్, ఎస్‌ఐ నరసింహారావు, విఆర్‌ఒలు నాగేశ్వరరావు, సుబ్బారావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక గజ ఈతగాళ్లసాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత సేపటికి మృతదేహాలు లభ్యం కాకపోవడంతో సీఐ ప్రభాకర్ ఉన్నతాధికారులతో మాట్లాడి మంగళగిరి, గుంటూరు నుండి ఫైర్ సిబ్బందిని పిలిపించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సాయంత్రం పొద్దుపోయే వరకు మృతదేహాలు దొరకక పోవడంతో గాలింపు చర్యలను ఆదివారానికి వాయిదావేశారు. ఈ సంఘటనపై అమరావతి సిఐ ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణానదిలో గల్లంతైన ఇద్దరు యువకులు స్థానికులే కావడంతో గోపాల్‌నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.