క్రైమ్/లీగల్

యువకుడిపై ఇనుప రాడ్‌తో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, సెప్టెంబర్ 16: యువకుడిపై ఇనప రాడ్‌తో మరో యువకుడు దాడి చేసిన సంఘటన ఆదివారం స్థానికంగా చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు వైకుంఠపురం యానాదికాలనీకి చెందిన వి శివయ్య రిక్షా నడుపుతూ జీవిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా యానాదికాలనీకి చెందిన కొందరు యువకులు తప్పెట్లు వాయించారు. వారికి అదే ప్రాంతానికి చెందిన మరో వర్గం యువకులకు వాగ్వావాదం జరిగింది. నిమజ్జనం పూర్తి అయిన తరువాత యుగంధర్ యానాదికాలనీలో వారి కోసం గాలించాడు. అతన్ని గమనించిన కాలనీ మహిళలు అనుమానంతో అతనికి దేహశుద్ధి చేశారు. దీంతో కక్ష పెంచుకున్న అతను మరికొందరు యువకులతో కలిసి రాడ్లు, కర్రలతో కాలనీకి వెళ్లాడు. అదే సమయంలో దుకాణం వద్దకు వచ్చిన శివయ్యపై దాడి చేసి కొట్టారు. ఘటనలో శివయ్య తల, కాలు, చేతిపై గాయాలయ్యాయి.
అతన్ని ఏరియా వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు.