క్రైమ్/లీగల్

అనూహ్యంగా మలుపు తిరిగిన ప్రణయ్ హత్య కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 16: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పి.ప్రణయ్‌కుమార్ కులదురహంకార హత్య కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది. హత్యకు పాల్పడిన కేసులో పలువురు నిందితులను పట్టుకుని పోలీసులు విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అమృత తండ్రి తిరునగరు మారుతిరావు, బాబాయి శ్రవణ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యతో సంబంధం కలిగి ఉన్న అనుమానంతో మిర్యాలగూడ పట్టణ కాంగ్రేస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండి.కరీం, మరొక వ్యక్తి ఖాసీంతో పాటు మిర్యాలగూడ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్, టిఆర్‌ఎస్ నాయకులు ఎడవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ దైదా సోమసుందర్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి రంగా శ్రీకర్, రంగా రంజిత్ కుమార్‌లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. వీరితో పాటు సుపారి తీసుకుని హత్య చేసిన మరో ఇద్దరిని కూడ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా ప్రణయ్‌ను హత్య చేసుకునేందుకు కోటి రూపాయలు ఒప్పందం కుదుర్చుకుని 50 లక్షలు అందజేసినట్టు తెలియవచ్చింది. గతంలో మారుతిరావు భూ వివాదంలో మారుతిరావును కిడ్నాప్ చేసిన నయిం గ్యాంగ్ చేయగా ఇరువురికి పరిచయం ఏర్పడింది. అతని తోడ్పాటు హత్యలో తీసుకున్నట్టు తెలిసింది. నల్లగొండకు చెందిన మహ్మద్ బారితో సుపారి కుదుర్చుకుని హత్యకు పాల్పడినట్టు తెలిసింది. ప్రస్తుతం బారి హైద్రాబాద్‌లో ఉంటున్నాడని పోలీసుల ద్వారా తెలిసింది. అయితే అరెస్టు విషయమై పోలీసులు పెదవి విప్పడం లేదు.