క్రైమ్/లీగల్

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 17: సాంకేతికంగా అభివృద్ది చెందిన నేటి పరిస్థితులలో నేరాలకు పాల్పడిన వారు పోలీసుల నుండి, చట్టం నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పి ఆర్. వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా జాతీయ రహదారులపై దొంగల ముఠా సభ్యులు గ్రూపుగా ఏర్పడి ఖరీదైన సరుకులు తీసుకు వెల్లుతున్న గూడ్స్ వాహనాలను టార్గెట్‌గా చేసి చాకచక్యంగా వాహనంపైకి ఎక్కి టార్పాలిన్ కట్ చేసి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో సూర్యాపేట పట్టణ పోలీసులు సర్వనలాల్ ముఠాకు చెందిన ముగ్గురు దొంగలను అధుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 194 కాటన్ లుపిన్ కంపెనీ మెడిసిన్, ఎలక్ట్రిక్ సామాన్లు, ఇంజన్ ఆయిల్ క్యాన్లు, 2 లక్షల 75వేల నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ. 1కోటి 15 లక్షల 62వేల విలువ ఉంటుందన్నారు. వీటితో పాటు డిసియం వాహనం, స్కార్పియోను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ ముఠాకు సంబందించిన నేరాలపై గతంలో పలు పిర్యాదులు వచ్చాయని అనుమానంతో ధర్యాప్తును ముమ్మరం చేశామని అందులో భాగంగా సూర్యాపేట పట్టణ సాంకేతిక సిబ్బందిని అప్రమత్తం చేసి పట్టణ ఇన్స్‌పెక్టర్ శివశంకర్, ఎస్సై శ్రీనివాస్‌ల ఆద్వర్యంలో బృందాలుగా ఏర్పాటు చేసి పిర్యాదుదారుడి లారీ వచ్చిన మార్గంలో ఆధారాలు సేకరించాలని ఆదేశించామని తెలిపారు. ఈ బృందాలు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ నెట్‌వర్క్ ట్రాక్ చేయడం జరిగిందని సెల్ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు. వారు అవుటర్ రింగ్ రోడ్డు లో, హైద్రాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై తిరుగుతున్నారని అనుమానితులపై నిఘా ఉంచగా వారు తెల్లవారు జామున హైద్రాబాద్ నుండి సూర్యాపేట మార్గంలో వెలుతున్నట్లు మొబైల్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి తెల్లవారు జామున 4 గంటల సమయంలో వారు వెళ్లుచున్న డిసియం వాహనాన్ని నిలిపి ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నగదు, సొత్తును స్వాదీనం చెసుకున్నామన్నారు. వీరు బెంగుళూర్, హైద్రాబాద్, నాగపూర్, పూణె, విజయవాడ జాతీయ రహదార్లు, అవుటర్ రింగ్ రోడ్డుపై నేరాలకు పాల్పడుతున్నారని, దొంగిలించిన సొత్తును హైద్రాబాద్, బెంగుళూర్, పూణెలో విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో 13 నేరాలకు పాల్పడినట్లు వారు అంగీకరించినట్లు తెలిపారు. ఈ మూఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పి సూర్యాపేట పట్టణ ఇన్స్‌పెక్టర్ శివశంకర్, ఎస్సై శ్రీనివాస్, సాంకేతిక సిబ్బంది జి. కరుణాకర్, జి. కృష్ణయ్య, సిహెచ్. శ్రీనివాస్, వెంకన్న, యాదగిరి, సుధాకర్, దుర్గాప్రసాద్‌లను అభినందించి రివార్డు అందజేశారు.