క్రైమ్/లీగల్

పరుపుల గోదాములో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 17: రాజమహేంద్రవరం కందకంరోడ్డులోని పరుపుల గోదాములో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈసంఘటనలో సుమారు రూ. 8లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. వివిధ కంపెనీల పరుపులు విక్రయించే శ్రీ్ఫమ్ ఏజెన్సీస్, సూర్య జనరల్‌స్టోర్ దుకాణానికి చెందిన పరుపులను గోదావరి రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న ఒక గోదాములో నిల్వ ఉంచారు. ఉదయం గోదాము నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు దుకాణం నిర్వాహకులకు తెలియజేశారు. వారు అగ్నిమాపక శాఖకు సమాచారాన్ని అందించడంతో ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు రెండు అగ్నిమాపకశకటాలతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈసంఘటనలో పెద్దసంఖ్యలో పరుపులు దగ్ధమయ్యాయి. అలాగే పొగకు పక్కన నివసించే ముగ్గురు వ్యక్తులు స్పృహ కోల్పోయారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే గోదాముకు విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. సంఘటనపై దుకాణం నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఐసీడీఎస్ సీడీపీవో ఆత్మహత్యాయత్నం
చింతూరు, సెప్టెంబర్ 17: పురుగుమందు తాగి చింతూరు ఐసీడీఎస్ సీడీపీవో శివకోటి గీత సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సీడీపీవో గీత ఆత్మహత్యాయత్నానికి షోకాజ్ నోటీసులే కారణమని తెలుస్తోంది. మండల కేంద్రం చింతూరులో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో కలిసి సీడీపీవో గీత ఒక ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇకోగార్డ్ అనే పురుగుల మందును సీడీపీవో గీత సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన సూపర్‌వైజర్లు ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల నుంచి గురక శబ్ధం వినిపించటంతో వెంటనే తాళం పగలకొట్టి ఇంట్లోకి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న సీడీపీవో గీతను కారులో చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు గీతకు వైద్యం అందజేశారు. మెరుగైన వైద్యం నిమిత్తం 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 8న ఏజీ కోడేరు గ్రామంలో అంగన్‌వాడీ -1 కేంద్రంలో కలుషిత ఆహారం తిని 11మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఉన్నతాధికారులు సూపర్‌వైజర్ కూరా రాధను సస్పెండ్ చేశారు. సీడీపీవో గీత, అంగన్‌వాడీ టీచర్ అచ్చెమ్మకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఐటీడీఏలో ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందితో సమావేశం కానున్నట్టు తెలియవచ్చింది. ఈ సమావేశంలో అధికారులు సీడీపీవో గీతను ప్రశ్నిస్తారని భయంతో ఆమె ఈ విధంగా పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా..పురుగుల మందు తాగిన గీత ప్రస్తుతం ప్రమాదం తప్పినా మరో రెండు రోజుల తర్వాత పురుగుల మందు ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని వైద్యులు చెబుతున్నారు.