క్రైమ్/లీగల్

217 టిక్కీల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్గి, సెప్టెంబర్ 17: దుర్గిలో ఆదివారం అర్ధరాత్రి 217 టిక్కీల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పలు గ్రామల నుండి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని వాహనం ద్వారా దుర్గి సబ్ స్టేషన్ వెనుక భాగంలో లారీలతో లోడు చేస్తున్న సమాచారం మేరకు... మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి సమాచారం అందించడంతో ఆయన అనుచరులతో ముటుకూరు రోడ్డు నుండి తరలివెళ్తున్న అక్రమ రేషన్ బియ్యం వాహనాలను అడ్డుకుని దుర్గి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని డీలర్లు వద్ద, కార్డుదారుల వద్ద తక్కువ రేట్లకు కొంతమంది దలారులు కొనుగోలు చేసి, ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. దుర్గి ఎస్‌ఐ సుబ్బానాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఎస్‌డీటీ శ్రీనివాసశర్మ దుర్గిలోని ఐదు రేషన్ షాపులను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. 217 టిక్కీల్లో 70 టిక్కీలు గొనెసంచుల్లో ఉన్నాయన్నారు. పరిసర గ్రామాల్లో రేషన్ షాపులను తనిఖీ చేయాలన్నారు. ఈ రేషన్ బియ్యాన్ని మాచర్ల గోదాముకు తరలించారు.

మృతదేహం కోసం జీబీసీలో గాలింపు చర్యలు
నకరికల్లు,సెప్టెంబర్ 17: ప్రమాదవశాత్తు గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో ఆదివారం రాత్రి గల్లంతైన బండారు ఆంజనేయులు (40) మృతదేహాం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నకరికల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేటకు చెందిన బండారు వీరాంజనేయులు వినాయకుని నిమజ్జనానికి అడ్డరోడ్డులోని గుంటూరు బ్రాంచ్ కెనాల్‌కి వచ్చాడు. ప్రమాదవశాత్తు జీబీసీలో గల్లంతుకావడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.