క్రైమ్/లీగల్

టీటీడీపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా నిర్వహణపై ప్రభుత్వ జోక్యాన్ని సవాలు చేస్తూ బీ.జే.పీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. టీ.టీ.డీ పాలనా నిర్వహణ తదితర అంశాలు ప్రభుత్వం జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కొరతూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన టీటీడీ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఆడిట్ నిర్వహణ ఇతరత్రా అంశాలను ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. సోమవారం సుప్రీంకోర్టులోని జస్టిస్ రోహింటన్ పాలి నారిమన్, జస్టిస్ ఇందుమాల్హోత్రలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. దీనిపై ధర్మాసనం ఇది స్థానిక అంశంగా వ్యాఖ్యానించడంతో పాటుగా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామికి అవకాసం కల్పిస్తూ, పిటిషన్‌ను తోసిపుచ్చింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి ట్వీటర్‌లో స్పందించారు. టీ.టీ.డీ విషయంలో నేను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఇప్పుడు నేను హైకోర్టును ఆశ్రయిస్తానని, ఇది ఒక మంచి ప్రారంభం అని పేర్కొన్నారు.