క్రైమ్/లీగల్

‘సారిడాన్’ విక్రయానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నొప్పి నివారిణి మాత్ర ‘సారిడాన్’ ఇక దేశంలోని అన్ని మందుల దుకాణాల్లో దొరుకుతుంది. ‘సారిడాన్’ సహా మరో మూడు మందుల విక్రయానికి సుప్రీంకోర్టు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిమళ్ హెల్త్‌కేర్‌కు చెందిన సారిడాన్, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌కు చెందిన పిరిటోన్, జుగ్గత్ ఫార్మాకు చెందిన డర్ట్, మరో మందును విక్రయించవచ్చునని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, ఇందు మల్హోత్రాతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. పై నాలుగు మందులతో సహా 328 మందులు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ)లను పాటించనందున కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 7న వాటిపై నిషేధం విధిస్తూ వాటి అమ్మకాలు జరపరాదని నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆయా ఫార్మా కంపెనీలు తాము నిబంధనలకు అనుగుణంగానే ఎన్నో ఏళ్ల నుంచి ఆ మందులను తయారుచేస్తున్నామంటూ తగిన ఆధారాలతో సహా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో సారిడాన్, పిరిటోన్, డర్ట్ సహా మరో మందు విక్రయాలు జరుపుకోవచ్చునని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. మిగిలిన మందుల విక్రయాలపై కేంద్రం నుంచి వచ్చిన స్పందన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.