క్రైమ్/లీగల్

రాజీవ్ హంతకులను విడుదల చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితులు ఏడుగురిని విడిచిపెట్టాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంఘటనలో మృతి చెందిన వారి బంధువులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం స్వీకరించింది. ఎస్.అబ్బాస్, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌పై వారి తరఫున హాజరైన అడ్వకేట్ జి.శివబాలమురుగన్ మాట్లాడుతూ 2014లో అప్పటి జయలలిత ప్రభుత్వం రాజీవ్ హత్యకేసులోని ఏడుగురు నిందితులను విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయంపై తాము దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం రాజీవ్ హంతకులను విడుదల చేయాలని మళ్లీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గతంలో తాము దాఖలు చేసిన పిటిషన్‌కు అదనపు వివరాలు జతపర్చడానికి అంగీకరించాలని ఆయన కోరారు. ఈ కేసుకు సంబంధించి 2014 నుంచి సుప్రీం కోర్టు పలు ఆదేశాలు జారీ చేసిందని, దీనికి సంబంధించిన వివరాలన్నీ రికార్డులో ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసును విచారించిన జస్టిస్‌లు రంజన్ గొగోయ్, నవీన్ సిన్హా, కెఎం జోసఫ్‌లతో కూడిన ధర్మాసనం దీనికి సంబంధించిన అదనపు పత్రాలను దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణ నిమిత్తం కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.