క్రైమ్/లీగల్

వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరహక్కుల నాయకులు వరవరరావుతోపాటు నలుగురు హక్కుల నేతల గృహనిర్బంధం మరోరెండు రోజులు పొడిగించారు. కోరేగావ్-్భమా హింసకు సంబంధించి ఐదుగురు హక్కుల నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారి విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఐదుగురు హక్కుల నేలకు గృహనిర్బందాన్ని ఈనెల 19 వరకూ పొడిగించింది. రెండ్రోజుల తరువాత తమ అభిప్రాయం వెల్లడిస్తామని కోర్టు ప్రకటించింది. ఆరోపణలను దృష్టిలో పెట్టుకునే ప్రతి క్రిమినల్ కేసులోనూ దర్యాప్తు జరుగుతుందని, ఈ కేసులో తాము మరింత లోతుగా విచారించాల్సి ఉందని జస్టిస్ ఏఎం ఖాన్వీకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
దర్యాప్తు లోపభూయిష్టంగా ఉన్నందున సిట్‌తో విచారణ చేయించాలని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించినట్టు వారన్నారు. ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా థాపర్‌తోపాటు పలువురు హక్కుల నేతల అరెస్టులు అక్రమమని, తక్షణం విడుదల చేయాలని సుప్రీంను కోరారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వారు అభ్యర్థించారు. రోమిల్లా ధాపర్‌తో పాటు ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, సోషియాలజీ ప్రొఫెసర్ సతీష్ దేశ్‌పాండే, మానవ హక్కుల న్యాయవాది మాజా దరువాల దాఖలు చేసిన పిటిషన్ బుధవారం పూర్తిస్థాయిలో విచారణకు రానుంది. ఈనెల 12న విచారణకు రాగా గృహ నిర్బంధం సోమవారం వరకూ పొడిగించారు. కోరేగావ్- భీమా హింసతో కవి, విరసం నేత వరవరరావును ఆగస్టు 28న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అలాగే గొన్సాల్వేస్, ఫెరెరియాను ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు. కార్మిక నేత సుధా భరద్వాజ్‌ను ఫరిదాబాద్‌లోనూ పౌర హక్కుల నేత నవ్‌లఖాను ఢిల్లీలోనూ అరెస్టు చేశారు. హక్కుల నేతల అరెస్టు కేసు కోర్టు విచారణలో ఉండగానే పుణె ఏసీపీ అత్యుత్సాహానికిపోయి మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించడంపై ఈనెల 6న సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై నేరారోపణలకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తెచ్చింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు.