క్రైమ్/లీగల్

వాయల్పాడు సీఐ లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 18: చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐగా పనిచేస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో బందోబస్తు విధులు నిర్వహించడానికి వచ్చిన సిద్దా తేజోమూర్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పీలేరుకు చెందిన సంయుక్త అనే మహిళ తిరుమలలో మీడియా ముందుకు వచ్చి కొంతకాలంగా తాను పడుతున్న ఇబ్బందులను వివరించింది. పీలేరు ఇందిరానగర్‌కు చెందిన తనకు అదే గ్రామానికి చెందిన వెంకటరత్నంతో 2006లో వివాహమైందని , ఒక పాప జన్మించిన తర్వాత తన భర్త జీవనోపాధికి కువైట్ వెళ్లాడని తెలిపింది. ఈ నేపధ్యంలో తన అత్తమామలు తనను అదనపు కట్నం తేవాలని వేధించేవారని పేర్కొంది. ఈమేరకు ఆనాడు తాను పీలేరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆనాడు పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా తేజోమూర్తి ఉండేవాడని తెలిపింది. ఏడాది గడుస్తున్నా తనకు న్యాయం జరగకపోవడంతో అత్తమామలు, భర్త రెండోపెళ్లిపై మళ్లీ ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషన్‌కు వెళ్లానన్నారు.తర్వాత తేజోమూర్తి వివిధ స్టేషన్లలో పనిచేశారు. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఇటీవల ఆయనను విఆర్‌కు పంపగా టీడీపీ నేత అండతో మళ్లీ వాయల్పాడు సిఐగా వచ్చారు. కేసు విచారణ విషయమై సంయుక్తతో తరచూ సిఐ ఫోన్‌లో మాట్లాడడం, వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తుకు తిరుమలకు వచ్చిన సీఐ ఆమెను తిరుమలకు రమ్మని వాట్సాప్ మెసేజ్ పంపినట్లు తన సెల్‌లో ఉన్న మెసేజ్‌ను మీడియాకు చూపించింది. అంతేకాకుండా తిరుమలలో నందకం అతిధిభవనంలో తనకోసం ఒక గది పెట్టినట్లు అక్కడకు వస్తే ఇద్దరూ కలిసి ఉండవచ్చని ఫోన్లో చెప్పిన విషయాన్ని మీడియాకు వినిపించింది. కాగా సంయుక్త తిరుమలలో విధులు నిర్వహిస్తున్న సిఐని నిలదీద్దామని మంగళవారం మహిళా సంఘాలతో కలిసి వెళ్లగా విషయం తెలుసుకుని సిఐ అక్కడినుంచి ఉడాయించాడని బాధితురాలు పేర్కొంది. కాగా, సీఐపై శాఖాపరమైన చర్యలకు డీఐజీ ఆదేశించారు.