క్రైమ్/లీగల్

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ 3కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణానదీ జలాలను తెలుగు రాష్ట్రాలకు విభజించేందుకు ఉద్దేశించిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తదుపరి విచారణ అక్టోబరు 3కు వాయిదా పడింది. బుధవారం ట్రిబ్యునల్‌లో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఏపీ తరపు సాక్షిగా ఉన్న హైడ్రాలజీ నిపుణుడు విశే్వశ్వరరావును తెలంగాణ సీనియర్ న్యాయవాది వైధ్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన పలు అంశాలను తెలంగాణ తరపు న్యాయవాది అడిగిన ప్రశ్నలకు విశే్వశ్వరరావు సమాధానం ఇచ్చారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ అడిగిన వివరాలకు తెలంగాణ సమాధానం ఇవ్వలేదని ట్రిబ్యునల్ దృష్టికి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు తీసుకొచ్చారు. దీనికి 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ట్రిబ్యునల్ పేర్కొంది. క్రాస్ ఎగ్జామినేషన్ సమయం ముగియడంతో తదుపరి విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై దాఖలైన పిటిషన్ల్ విచారణను కూడా సుప్రీం కోర్టు అక్టోబరు 3కు వాయిదా వేసింది.