క్రైమ్/లీగల్

గృహ నిర్బంధం మరోరోజు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ప్రజాకవి వరవరరావుసహా నలుగురు హక్కుల నేతల గృహనిర్బంధంపై సుప్రీం కోర్టు గురువారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఐదుగురు హక్కుల నేతల గృహనిర్బంధంపై విధించిన గడువుబుధవారంతో ముగియనుండగా మరోరోజు అంటే గురువారానికి పొడిగించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా నేతృత్వంలోని న్యాయమూర్తులు ఎఎం ఖాన్వీకర్, డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం హక్కుల నేతల అరెస్టులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారించనుంది. చరిత్రకారిణి రొమిల్లా థాపర్, మరో నలుగురు హక్కుల నేతల అరెస్టును సుప్రీంలో సవాల్ చేశారు. ఈనెల 17న వాదనలు విన్న ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. కోరేగావ్-్భమాలో చోటుచేసుకున్న హింసకు సంబంధించి వరవరరావుసహా నలుగురు హక్కుల నేతలకు సంబంధం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిందితులపై కచ్చితమైన సాక్ష్యాధారాలున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే మహారాష్ట్ర పోలీసుల అరెస్టుచేసిన ఐదుగురు నేతలనూ తక్షణం విడుదల చేసి, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని థాపర్ సహా పలువురు సుప్రీంను ఆశ్రయించారు.