క్రైమ్/లీగల్

17 ఏళ్ల బాలుడికి 20 ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిస్సార్ (హర్యానా), సెప్టెంబర్ 19: ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత ఆమెను హత్య చేసిన నేరానికి 17 ఏళ్ల బాలుడికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో గల ఉల్కానా పట్టణంలో ఒక బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన 17 ఏళ్ల బాలుడికి హిస్సార్ కోర్టు ఈ శిక్ష విధించింది. 2017 డిసెంబర్ 8న రాత్రి ఆ బాలికను ఎత్తుకెళ్లి, రేప్ చేసి, ఆ తరువాత హత్య చేసిన నేరానికి ఆ బాలుడికి జైలు శిక్షతో పాటు రూ. 80వేల జరిమానా కూడా విధిస్తూ హిస్సార్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి డీఆర్ చాలియా బుధవారం తీర్పు చెప్పారు. ముద్దాయి రూ. 80వేల జరిమానా చెల్లించడంలో విఫలమయితే, అదనంగా మరో రెండేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. నిందితుడిని బాల నేరస్థుడిగా భావించి తొలుత ఈ కేసును విచారించారు. అయితే, తరువాత ఈ కేసును జిల్లా, సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. అత్యాచారం, హత్య వంటి క్రూరమయిన నేరాలకు పాల్పడితే 16-18 ఏళ్ల మధ్య వయస్సు గల వారిని కూడా మేజర్లుగా పరిగణిస్తూ విచారించడానికి అనుగుణంగా ద జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం- 2015ను సవరించిన విషయం తెలిసిందే. ముద్దాయికి 21 ఏళ్లు వచ్చే వరకు అతడిని సోనిపట్‌లోని బాల నేరస్థుల గృహంలో ఉంచుతారు. ఆ తరువాత అతడిని జైలుకు తరలిస్తారు.