క్రైమ్/లీగల్

ప్రేమ.. పెళ్ళి.. హత్యాయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, సెప్టెంబర్ 19: మిర్యాలగూడలో ప్రణయ్ హత్య సంఘటన మరువక ముందే ఎర్రగడ్డలో అదే తరహాలో హత్యాయత్నానికి పాల్పడ్డాడో తండ్రి. కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో అల్లుడితో పాటు కన్న కూతుర్ని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం వారిని ఎర్రగడ్డ ప్రధాన రహదారిపై ఉన్న ప్రతుల్ హోండా షోరూమ్ వద్దకు పిలిపించాడు. తన సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అతనితో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నవ వధువులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చేటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
బోరబండలో నివాసం ఉండే మనోహరాచారి బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటాడు. ఇతని కుమార్తె మాధవి (22) సనత్‌నగర్‌లోని హిందూ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈమెకు కూకట్‌పల్లి వివేకానంద కాలేజీలో డిగ్రీ చదువుతున్న పీ.సందీప్‌తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. ప్రేమ వ్యవహారం మనోహరాచారి ఇంట్లో తెలియడంతో దళితుడైన సందీప్‌ను వివాహం చేసుకునేందుకు నిరాకరించారు. దీంతో వారు నెలరోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయమై పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య వివాదాలు చోటుచేసుకోవడంతో స్థానిక బస్తీవాసుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి మనోహరాచారికి సర్దిచెప్పడంతో శాంతించాడు. కానీ కుమార్తె ప్రేమ వివాహం అతన్ని నిత్యం కలిచివేయ సాగింది. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య చోటుచేసుకోవడంతో ఆ దిశగా ఆలోచించి వారిని నమ్మకంగా హోండా షోరూమ్ వద్దకు పిలిపించి కత్తితో మొదట సందీప్‌పై ముఖంపై దాడి చేశాడు. అనంతరం కుమార్తె మాధవి మెడపై దాడిచేసి పారిపోయాడు. ఈ సంఘటనతో రోడ్డుపై ప్రయాణిస్తున్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న ఇరువుర్ని స్థానికంగా ఉన్న నీలిమా ఆసుపత్రికి తరలించారు. సందీప్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, మెడపై తీవ్రగాయాలైన మాధవి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు. దళిత సంఘాలు తీవ్రస్థాయిలో దాడిని ఖండించాయి. ఆధునిక సమాజంలో సైతం కుల వివక్ష ఏ మేరకు ఉందో ఇలాంటి సంఘటనల ద్వారా స్పష్టం అవుతున్నదని అన్నారు. మానవత్వం మరచి దాడులకు తెగబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన మాధవి తండ్రి చారి పోలీసులకు లొంగిపోయాడు.
చిత్రాలు.. మాధవి, సందీప్ పెళ్లినాటి ఫోటో
*తీవ్రంగా గాయపడిన మాధవి, *ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్.