క్రైమ్/లీగల్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దోపిడీ కేసు నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 19: నెల్లూరు జిల్లా తడలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఈనెల 17న జరిగిన రూ.కోటి దోపిడీ కేసును నెల్లూరు పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. చోరీకి పాల్పడిన బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ కొత్తపల్లి పవన్‌కుమార్‌ను బుధవారం ఉదయం నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని రుద్రకోట గ్రామ సమీపంలో పట్టుకున్నారు. అతని వద్ద నుండి చోరీ చేసిన నగదులో రూ.99,91,000లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.9వేలను నిందితుడు ఖర్చు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసును అతిస్వల్ప వ్యవధిలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని గుంటూరు రేంజ్ ఐజి వి వేణుగోపాలరావు అభినందించి రివార్డులు అందచేశారు.