క్రైమ్/లీగల్

ఆటోలోనే గర్భిణి ప్రసవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 21: ఆటోలోనే గర్భిణీ ప్రసవించిన సంఘటన జిల్లా కేంద్రమైన చిత్తూరులోని జిల్లా వైద్యశాల ఆవరణలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇంటి వద్ద పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళను ఆసుపత్రికి తీసుకొస్తుండగా, ఆటో ఆసుపత్రి అవరణలోకి రాగానే ఈ నొప్పులు ఎక్కువ కావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై ఆటో చుట్టు తెరలు ఏర్పాటు చేసి డెలివరీ చేశారు. చిత్తూరు రూరల్ మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రాము భార్య అములుకు శుక్రవారం ఉదయం ఇంటి వద్దనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు అములును ఆటోలో చిత్తూరు ప్రధాన అసుపత్రికి తీసుకురావడానికి బయలు దేరారు. మార్గమధ్యంలోనే ఈ నొప్పులు ఎక్కువ కావడంతో ఆటో ఆసుపత్రి అవరణలోకి రాగానే ఆ మహిళ అటోదిగలేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఆసుపత్రిలో బెంగళూరుకు చెందిన వైదేహి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్యశిబిరానికి పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య అధికారులు హాజరయ్యారు. ఆటోలో అములకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయని కుటుంబ సభ్యులు అక్కడే ఉన్న వైద్య సిబ్బందికి తెలిపారు. వెంటనే స్పందించిన డీసీహెచ్‌ఎస్ సరళ హుటాహుటిన ఆటోవద్దకు వెళ్లి దాని చుట్టూ తెరలు ఏర్పాటు చేసి ఆ మహిళకు ప్రసవం చేశారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉంటడంతో ఆంతా ఊపిరి పీల్చుకొన్నారు. ప్రత్యేక వైద్య పరీక్షలు కోసం తల్లీబిడ్డలను ఆసుపత్రిలోనికి తీసుకెళ్లారు.