క్రైమ్/లీగల్

సీఎండీ ఇంట్లో సోదాలు: రూ. 60 లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఫ్యూచర్ మేకర్ లైఫ్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎఫ్‌ఎంఎల్‌సీ) మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో సంస్థ అధినేత రాధేశ్యామ్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా సుమారు 3వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ ఎకనామిక్ అఫెనె్సస్ వింగ్ (ఈఓడబ్లూ) సీఎండీ రాధేశ్యామ్‌తో పాటు ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో జరిపిన సోదాలలో కేసుకు సంబంధించిన కీలక పత్రాలను, నగదును, వాహనాలను, పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. రాధేశ్యామ్ గతంలో ఆర్‌సీఎం (రైట్ కానె్సప్ట్ మార్కెటింగ్) ఎంఎల్‌ఎం కంపెనీలో ఆరు సంవత్సరాలు పనిచేసినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటుపడిన రాధేశ్యామ్‌కు కావల్సినంత డబ్బులు రాకపోవడంతో తానే స్వయంగా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని ఫ్యూచర్ మేకర్‌ను ప్రారంభించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. హరియానా రాష్ట్రం హిసార్ ప్రాంతానికి చెందిన రాధేశ్యామ్, భన్సీలాల్, సురేందర్ సింగ్, మనోజ్, సద్బీర్‌సింగ్‌లతో కలసి ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. కంపెనీలో చేరే సభ్యులు బైనరీ సిస్టమ్ కింద ఒకరు ఇద్దరిని చేర్పించాల్సి ఉంటుంది. ఈ గొలుసుకట్టు పద్ధతిలో పిరమిడ్‌లో పైన ఉన్నవారు మాత్రమే లాభపడేలా ముందే పథకం వేసుకుంటారని కేసు దర్యాప్తు చేస్తున్న డీసీపీ విజయకుమార్ తెలిపారు. రూ.7500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, చెల్లించిన సొమ్ములో 2500 మినహాయించుకుని 5వేలకు హెల్త్ ప్రొడక్ట్స్ అందచేస్తారని చెప్పారు. ఈ ముఠా దేశ వ్యాప్తంగా 60 లక్షల మంది నుంచి 3వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసిందని డీసీపీ చెప్పారు. నిందితులు హరియానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతను సభ్యులుగా చేర్పించినట్లు వివరించారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ పోలీసులు ఎఫ్‌ఎంఎల్‌సీ ఉత్పత్తులు నిల్వ ఉంచే గోడౌన్‌లు, కంపెనీ ప్రధాన కార్యాలయంలోను ముఖ్యమైన ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిపారు. సోదాల్లో ఒక పిస్తోల్‌తోబాటు 10 రౌండ్స్ బుల్లెట్లు, 4 ల్యాప్‌టాప్‌లు, ఆరు మొబైల్ ఫోన్లు, 60 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితులు వినియోగించిన ఫార్చునర్, ఫోర్డ్ ఎండీవర్, జాగ్వార్ కార్లను కూడా సీజ్ చేసినట్లు డీసీపీ వివరించారు. సోదాలు చేసి వాహనాలను ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.