క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, సెప్టెంబర్ 21: తండ్రి దివ్యాంగుడు.. తల్లి వయస్సు పైబడింది.. పెళ్లికి ఇద్దరు చెల్లెళ్లు.. తాను ఎదో కష్టం చేస్తే తప్ప కుటుంబ ఆర్థిక పరిస్థితులు చక్కబడేలా లేవని భావించి దుబాయ్ వెళ్లి తమ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని భావించాడు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు దుబాయ్ వెళ్లేందుకు తల్లితో పాటు బంధువులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తూ మార్గమధ్యలో మృతిచెందిన సంఘటన కొందుర్గు మండలం రాంచంద్రాపూర్ దగ్గర చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లి తండాకు చెందిన ఉమ్లిబాయి, నార్యానాయక్ దంపతులకు ముగ్గురు సంతానం. బాబు (22) మగసంతానం. మిగితా ఇద్దరు ఆడపిల్లలు. తండ్రి దివ్యాంగుడు. తల్లి వయస్సు పైబడటంతో సంసార భారం తనపై వేసుకుని బాబు కుటుంబ పోషణ కోసం కృషి చేస్తున్నాడు. ఇదేక్రమంలో తాను ఇక్కడ ఉంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కష్టమని భావించి దుబాయ్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. శుక్రవారం తన తల్లితో పాటు చిన్నమ్మ, చిన్నాన్నతో కలిసి దుబాయ్ వెళ్లేందుకు బయలుదేరాడు. కొందుర్గు మండలం రాంచంద్రాపురం దగ్గరకు వెళ్లేసరికి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన మిషన్ భగీరథ గుంతలు ఉండటంతో స్టీరింగ్ అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో భాజపా నాయకుడు శ్రీవర్ధన్‌రెడ్డి అదే మార్గంలో ప్రయాణిస్తుండగా, ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. మదన్‌పల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.