క్రైమ్/లీగల్

బాసర వర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, సెప్టెంబర్ 22: నిర్మల్ జిల్లా బాసర ఆర్‌జేయుకేటీ యూనివర్సిటిలో శనివారం విద్యార్థిని కళాశాల వసతిభవనంపై నుండి పడి ఆత్మహత్యకు పాల్పడిందని బాసర ఎస్సై మహేష్ తెలిపారు. పోలీసులు కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన అనూష (17) ఆర్‌జేయుకేటీలో పీయుసీ రెండవ సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. శనివారం ఉ. 12 గంటల ప్రాంతంలో కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స నిమిత్తం అనూషను నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయంది. ఆత్మహత్యకు ముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు పేర్కొన్నారు. అయతే, ఇంటివద్ద బంధువుల అబ్బాయితో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టినందునే ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఆ అబ్బాయిని శిక్షించవద్దని లేఖలో ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు బాసర ఎస్సై మహేష్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. భైంసా డీఎస్పీ రాజేష్ భల్లా కళాశాల భవనాన్ని, విద్యార్థిని వసతి గృహాన్ని సందర్శించారు. కళాశాల ఏవో వెంకటస్వామి, ట్రిపుల్ ఐటీ సీఐ అంజయ్య, ఎస్సై మహేష్, తదితరులు ఉన్నారు.

అనూష ఫైల్‌పొటో