క్రైమ్/లీగల్

భవనం పైనుండి దూకి ప్రేమజంట ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, సెప్టెంబర్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని బాపూజీనగర్‌లో నివాసముంటున్న లిఖిత స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కేటీపీఎస్ ఇంటర్మీడియట్ కాలనీలో నివాసం వుంటున్న మణికంఠతో లిఖిత ప్రేమలో పడింది.
మణికంఠ పాలిటెక్నిక్ డిప్లమో చదువుతున్నట్టు తెలిసింది. వీరి మధ్య ఏంజరిగిందో తెలియదు కానీ ఇద్దరూ ఆదివారం రాత్రి 9గంటల సమయంలో కాంట్రాక్టర్స్ కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న మూడంతస్థుల భవనం పైనుండి కిందికి దూకేశారు. మణికంఠ తలకు తీవ్ర గాయాలు కాగా, లిఖితకు ఎడమకాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించగా మణికంఠ మార్గమధ్యంలో చనిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.