క్రైమ్/లీగల్

యువతిని రక్షించి, యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి, సెప్టెంబర్ 25: విద్యుదాఘాతమై ఆపదలో వున్న యువతిని రక్షించి, ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుని ఉదంతమిది. మండలంలోని కాకరపర్రులో మంగళవారం జరిగిన ఈ ఘటనలో తేతలి గ్రామానికి చెందిన వీరవల్లి వీరవెంకట ప్రసాద్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన వీరవల్లి వెంకట ప్రసాద్ అమ్మమ్మ గారి ఊరు అయిన కాకరపర్రుకు పెయింట్ వేసే పనికి వచ్చాడు. మంగళవారం పెయింట్ పని చేస్తుండగా పక్కనే వున్న నీళ్ళ పంపుకొడుతున్న గుడాల నాగశిరీషకు విద్యుత్ షాక్ తగిలింది. గమనించిన వీరవెంకట ప్రసాద్ ఆమెను రక్షించడానికి నీళ్ల పంపు వద్దకు వెళ్ళాడు. ఆమెను తప్పించి, తను ప్రమాదవశాత్తూ నీళ్ళ పంపుమీద పడడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. స్వల్ప గాయాలతో బయట పడ్డ గుడాల నాగ శిరీష తణుకు ఆసుపత్రిలో కోలుకుంటోంది. పెరవలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.