క్రైమ్/లీగల్

యువతపై అందమైన వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, సెప్టెంబర్ 25: అందమైన యువతుల ఫోటోలను వెబ్‌సైట్‌లో పెట్టి యువకులకు యువతులను ఎస్కాట్‌గా పంపిస్తామని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోని పలు భాషలు మాట్లాడే యువతులను ఆయుర్వేదం ముందులు సేల్స్ కోసమని నియమించుకుని అనంతరం కాల్ సెంటర్‌లో ఉద్యోగులుగా యువకులకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను సీపీ సజ్జనార్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన డెబాశిషా ముఖర్జీ, ఫజల్ హక్, అనిత డే, సందీప్ మిత్రా, నేత శంకర్ కలసి, గేట్ యంగర్ లేడీ, మై లవ్ 18 డాట్ ఇన్ పేర్లతో వెబ్ సైట్లను ఏర్పాటు చేసి యువకులకు అమ్మాయలను ఎస్కాట్‌గా పంపిస్తామని ఫోన్‌లు చేసి మోసాలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు.
నిందితులు సృష్టించిన సైట్‌ని క్లిక్ చేసి పేరు నమోదు చేసుకున్న వారికి ఫోన్ చేసి తమ వద్ద అందమైన యువతులు ఉన్నారని ఆశ చూపించి మోసాలు చేస్తున్నట్లు చెప్పారు. సభ్యులుగా చేరిన వారి నుంచి మెంబర్ షిప్ ఫీజు రూ.1080, క్లబ్ లైసెన్స్ ఫీజు రూ.27,600 రిజిస్ట్రేషన్ రూ.37,700, సర్వీస్ ఛార్జీ రూ.87,634, జీఎస్,టీ రూ.4లక్షల 50, అకౌంట్ పరిశీలన, బ్యాంక్ పరిశీలన, ఫైనల్ పేమెంట్ పేరుతో రూ.4లక్షలు మొత్తం 15 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నట్లు వివరించారు. సభ్యులనుంచి ఫీజుల పేరుతో అందినంత డబ్బు గుంజేవారిని వివరించారు. సభ్యులకు సిల్వర్, గోల్డ్, ప్లాటినం మెంబర్‌షిప్‌లు ఇచ్చేవారని దాంతోపాటు ఆల్ ఇండియా లైసెన్స్‌ల పేరుతో సభ్యులను మోసం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రూ.150 కోట్ల వరకు మోసం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.