క్రైమ్/లీగల్

విద్యార్థిని మృతి అనుమానాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 25: నగరాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో చోటుచేసుకున్న విద్యార్థుల అనుమానాస్పద మృతి సంఘటన గ్రామీణ ప్రాంతానికి పాకింది. స్థానిక గౌతమి జూనియర్ కళాశాలలో మంగళవారం తెల్లవారుజామున విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్య అభ్యసిస్తున్న మృతురాలి సోదరి శిరీషారెడ్డి, కళాశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం మర్పల్లి మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన మాణిక్ రెడ్డి, సావిత్రమ్మ కుమార్తె మనీషారెడ్డి(16) గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో అక్క శిరీషారెడ్డి రెండో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరు అదే కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఒకే గదిలో ఉంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున వాష్‌రూంకు వెళ్ళిన మనీషారెడ్డి తిరిగి రాలేదు. హాస్టల్ వెనుక భాగంలో శవమై కనిపించడంతో దారివెంట వెళుతున్న వ్యక్తులు చూసి కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకునే లోపే చికిత్స నిమిత్తం మనీషా రెడ్డిని వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా మనీషా రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కళాశాల యాజమాన్యం పోలీసులకు వివరించగా, మృతురాలి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం మనీషారెడ్డికి లేదని, కళాశాల మూడో అంతస్తు నుండి కిందపడిన మనీషాను పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించకుండా కిలోమీటరు దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించడమేమిటని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మనీషారెడ్డి మృతి సంఘటన తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ముందుగా ఆసుపత్రికి చేరుకుని మనీషాను చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఎన్టీయార్ కూడలిలో, కళాశాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదంతా జరుగుతుండగానే మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు చర్చలు జరిపి చెల్లింపునకు సిద్ధమైనట్లు ప్రచారం. కాగా మనీషారెడ్డి మృతి మిస్టరీగానే మిగిలింది. ఎస్పీ అన్నపూర్ణ, డీఎస్పీ శిరీష సంఘటనా స్థలికి చేరుకుని విషయం తెలుసుకుని చర్యలు తీసుకుంటామని మీడియాకు చెప్పారు. చదువు ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేక, ఎవరైనా భవనం పైనుండి తోసి హత్య చేశారా మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.