క్రైమ్/లీగల్

రాఘవేంద్రనగర్‌లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 26 : సిద్దిపేట శివారు రాఘవేంద్రనగర్‌లో ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి 5తులాల బంగారం, 20తులాల వెండి, 20వేల నగదును అపహరించారు. సిద్దిపేట వన్‌టౌన్ ఎస్‌ఐ పోలీసుల కథనం వివరాలు ఇలావున్నాయి. రాఘవేంద్రనగర్‌కు చెందిన వేణు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఈనెల 20న సాయంత్రం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. తిరిగి 25న రాత్రి ఇంటికి వచ్చి తాళం తీసి చూసేసరికి ఇంటి వెనుక ఉన్న తలుపు పగులగొట్టి ఉంది. ఇంట్లోని పలు సామాన్లు చిందరవందరగా ఉన్నాయి. ఇంట్లోని మూడు బీరువాల తలుపులు పగుల గొట్టి ఉన్నాయి. బీరువాల్లోని 3తులాల నాను గొలుసు, 2 తులాల ఉంగరాలు, 20 తులాల వెండి పూజ సామాగ్రీ, 20వేల నగదు, ఎల్‌ఈడీ టీవీ, పట్టు వస్త్రాలు చోరీకి చేశారు. బాధితుడు వేణు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

పిడుగుపాటుకు 21 గొర్రెలు మృతి
ములుగు, సెప్టెంబర్ 26: ఉమ్మడి ములుగు మండల పరిధిలోని కర్కపట్ల గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు కర్కపట్ల గ్రామానికి చెందిన కనె్నబోయిన శ్రీశైలంకు చెందిన 21 గొర్రెలు మృతి చెందాయ. గొర్రెల మృతితో ఆ కుటుంబం దీనావస్తకు చేరుకుంది. గొర్రెల పెంపకంపైనే ఆధారపడిన కుటుంబం కాబట్టి ఒకేసారి పిడుగుపాటుకు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే గ్రామస్థులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గ్రామ మాజీ సర్పంచ్ సుగుణాకర్‌రెడ్డి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా అధికారులు పంచానామా చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన కోరారు.