క్రైమ్/లీగల్

జాతీయ రహదారిపై బొగ్గులారీ దగ్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, సెప్టెంబర్ 27: కడప-కర్నూలు జాతీయ రహదారిలో దువ్వూరు సమీపంలోని గురువారం క్రీస్తురాజపురంవద్ద ఆగిఉన్న లారీని మరో లారీ ఢీకొన్న సంఘటనలో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడని ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాల్లోకెళ్తే కడప నుంచి కర్నూలువైపు బొగ్గుతో పూణే వెళ్తుండగా క్రీస్తురాజపురంవద్ద ఆగిఉన్న ఉక్కు లారీ టీయన్ 52 ఎక్స్ 6075 నెంబరుగల లారీని అదేదారిలో వెళ్తున్న మహారాష్టక్రు చెందిన ఎంహెచ్12 ఎన్‌హెచ్ 0905 నెంబరుగల లారీ ఢీకొన్న సంఘటనలో మంటలు చెలరేగాయి. డ్రైవర్లు వంట కోసం తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ వెనుక భాగంలో ఉంచడంవల్ల నేరుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ అగ్ని ప్రమాదానికి గురైపూర్తిగా కాలిపోయాడు. ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇవ్వగా ఆ వాహనం వచ్చేసరికే పూర్తిగా లారీ ఖాళిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసులు, నేషనల్ హైవే పోలీసులు, తహసీల్దార్ శేషారాంసింగ్‌లు చేరుకుని సంఘటనను పరిశీలించారన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్నట్లు ఎస్ ఐ సుబ్బారావ్ తెలిపారు.