క్రైమ్/లీగల్

15 లక్షలు విలువ చేసే గుట్కా, ఖైనీ బస్తాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బద్వేలు, సెప్టెంబర్ 27: నిషేధిత గుట్కా, ఖైనీలను విక్రయిస్తున్న బద్వేలు పట్టణంలోని ముగ్గురు నిర్వాహకుల ఇళ్లపై గురువారం విజిలెన్స్ అధికారులు దాడులుచేసి 15 లక్షలు రూపాయలు విలువగల 110 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ నరహర ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు ఏక కాలంలో పట్టణంలోని ఆంజనేయనగర్, దూదేకుల వీధి, శివానగర్‌లలోని ప్రభుత్వ నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న ఇళ్లపై దాడులు చేశారు. ఈసందర్భంగా అడిషనల్ ఎస్పీ నరహర విలేఖరులతో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారంమేరకు బద్వేలు పట్టణంలోని అక్రమ గుట్కా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ముగ్గురి ఇళ్లపై దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ప్రభుత్వం నిషేదించిన 110 బస్తాల ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని వాటివిలువ సుమారు 15 లక్షల రూపాయలు చేస్తుందని తెలిపారు. అలాగే ఎటువంటి ట్యాక్స్‌లు కట్టని ప్యారీస్ కంపెనీకి చెందిన 15 బాక్స్‌ల సిగరెట్లును కూడా స్వాధీనం చేసుకున్నామని వీటివిలువ కూడా సుమారు 1.5 లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. మన దేశంలో 17 రాష్ట్రాలలో గుట్కా, ఖైనీలను నిషేధించారని అయితే ఇక మిగిలిన రాష్ట్రాల నుంచి ఇక్కడి వ్యాపారస్తులు అక్రమంగా వాటిని కొనుగోలుచేసి బద్వేలు ప్రాంత పరిధిలో అధిక రేట్లుకు విక్రయిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బద్వేలు నుంచి ఈ వ్యాపారం ఇతర జిల్లాలకు కూడా పాకుతున్నదని ఈ ముగ్గురు వ్యాపారస్తులు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం, ఉదయగిరి, తదితర ప్రాంతాల్లో గల వ్యాపారస్తులకు నిషేధిత గుట్కాలను విక్రయిస్తున్నారని తెలిపారు. వీటిని వాడటం వలన క్యాన్సర్ తదితర హానితో కూడిన అనారోగ్యం వస్తుందని, ప్రజలు నిషేధించిన వీటిని తినకూడదని తెలియజేశారు. ఈ దాడులలో గుట్కా అక్రమ వ్యాపారం చేస్తున్న ఎం.నారాయణ, వి.రమణయ్య, ఎం.శివ లను అదుపులోనికి తీసుకొని వీరిపై నాన్‌బెయిలబుల్ కింద కేసులు నమోదుచేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఫుడ్ సేప్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ కిందకూడా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ దాడులకు బద్వేలు పోలీసులు కూడా తమ వంతు సహకారం వహించారని తెలిపారు.