క్రైమ్/లీగల్

రైలు కింద పడి పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 27: స్థానిక చింతలచేను వద్ద ఉన్న రైల్వేట్రాక్‌పై బుధవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ట్రిపుల్ ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అశోక్‌గా గుర్తించారు. అశోక్ ఆత్మహత్యకు ప్రిన్సిపల్, ప్రొఫెసర్లే కారణమంటూ విద్యార్థులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. తిరిగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అశోక్ కళాశాలలో విద్యార్థినులు, మహిళా ప్రొఫెసర్లు పట్ల దురుసుగా వ్యవహరిస్తుండటంతో హెచ్చరించామే తప్ప, మరెలాంటి చర్యలు తీసుకోలేదని పాలిటెక్నిక్ అధికారులు అంటున్నారు. అశోక్ తాను చదువుకు స్వస్తి చెప్పి వెళ్లిపోతానంటూ హాస్టల్ నుంచి మంగళవారం ఖాళీ చేసి వెళ్లాడని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన దస్తగిరి, జ్ఞానమ్మల చిన్న కుమారుడు అశోక్. తండ్రి చనిపోవడంతో తల్లి జ్ఞానమ్మ తన కుమారుడిని తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో చేర్పించింది. మంగళవారం ఓ ఉపాధ్యాయురాలు అశోక్‌ను ఓ ప్రశ్నను అడిగినప్పుడు, అతడు చెప్పిన సమాధానం దురుసుగా, హేళనగా ఉండటంతో ప్రిన్సిపాల్ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ వెంకట్రావు అశోక్‌ను పిలిపించి ఆకతాయి చేష్టలకు పాల్పడి, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో కొంత ఆందోళన చెందిన అశోక్ చదువుకు స్వస్తి చెప్పాలని భావించి, తాను ఉంటున్న హాస్టల్ గదిని కూడా ఖాళీ చేశాడు. తన ఊరికి వెళ్లిపోతున్నట్లు స్నేహితులకు చెప్పాడు. ఈ సమాచారం తెలుసుకున్న అశోక్ సోదరుడు బుధవారం తిరుపతికి వచ్చాడు. అశోక్ ఆచూకీ లభించకపోవడంతో అతని కోసం గాలించారు. ఈ క్రమంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది అశోక్‌గా గురువారం గుర్తించారు. తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలుసుకుని అతని తల్లి, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.