క్రైమ్/లీగల్

రియల్‌ఎస్టేట్ వ్యాపారి దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేస్తవారపేట, సెప్టెంబర్ 27: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏర్పడిన ఆర్థిక వివాదాల కారణంగా రియల్టర్‌ను దారుణంగా హత్య చేసిన సంఘటన మండల కేంద్రం బేస్తవారపేటలో గురువారం తెల్లవారుజామున జరిగింది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మద్దుల రమణారెడ్డి(50) స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న రమణారెడ్డిని కత్తులతో దాడిచేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఇంటి కటాంజనం తాళాలు పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించి హత్యచేయడం వెనుక కిరాయి హంతకులు రమణారెడ్డి కదలికలపై రెక్కీ నిర్వహించి హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుని భార్య లక్ష్మీకుమారి దోపిడి దొంగలు అనుకుని ఇంట్లో ఉన్న బంగారు, డబ్బులు ఇస్తానని, తన భర్తను చంపవద్దని మొరపెట్టుకుని, ఆ తరువాత వారిపై తిరగబడగా ఆమెను తీవ్రంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయలయ్యాయి. ఈ సంఘటనపై లక్ష్మీకుమారి వెంటనే పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చింది. మృతుడు రమణారెడ్డి కంభం, బేస్తవారపేట, గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్య సంఘటనపై ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు, గిద్దలూరు సీ వి.శ్రీరామ్, బేస్తవారపేట ఎస్సై కిశోర్‌బాబు, కంభం ఎస్సై రామానాయక్ పరిశీలించారు. ఒంగోలు నుంచి డాగ్‌స్వ్కాడ్, క్లూస్ టీంలను రప్పించారు. పోలీసు జాగిలం సంఘటన ప్రాంతం నుంచి వైఎసార్ నగర్ వరకు వచ్చి నిలిచిపోయింది. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు మృతుని భార్య లక్ష్మీకుమారి పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
రమణారెడ్డి హత్య విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కంభం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీలు వేగినాటి ఓసూరారెడ్డి, రవికుమార్ యాదవ్, పార్టీకార్యకర్తలు ఉన్నారు.