క్రైమ్/లీగల్

కట్న దాహానికి ఐటీ ఉద్యోగిని బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, సెప్టెంబర్ 30: ప్రేమించి పెళ్లి చేసుకుని ఆరు నెలలైనా గడవకుండానే అత్తమామల వేధింపులకు నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలి బంధువులు, పోలీసులు కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన పసుపులేటి మురళీకృష్ణ కుమార్తె రూపిణి (25) అదే ప్రాంతానికి చెందిన సందీప్‌రాజ్‌ను గత మార్చి 4న ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో ఇరువర్గాలు ఒకటయ్యాయ. అనంతరం రూపిణికి ఐటి కంపెనీలో జాబ్ రావడంతో నగరానికి వచ్చింది. రూపిణి తండ్రి మురళీకృష్ణ ఏప్రిల్‌లో రాయదుర్గంలోని చిత్రపురి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని అల్లుడిని, కుమార్తెను వదిలి వెళ్లాడు. సందీప్ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. నెలరోజుల క్రితం సందీప్ తల్లిదండ్రులు వచ్చి కోడలికి రావాల్సిన ఆస్తిని తీసుకురమ్మని వేదించగా భర్త వంత పాడేవాడు. బుధవారం గొడవ పడడంతో రూపిణి తండ్రికి సమాచారం ఇవ్వడంతో మురళీకృష్ణ వచ్చి నచ్చచెప్పి వెళ్లాడు. తిరిగి అత్తమామలు, భర్త గొడవ చేయడంతో తండ్రికి ఫోన్ చేసింది. శనివారం సాయంత్రం వచ్చిన మురళీకృష కుమార్తెకు టిఫిన్ తీసుకురావడానికి వెళ్లి వచ్చేసరికి రూపిణి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం వేధించడంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని రాయదుర్గం పోలీసులకు మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు.

ద్విచక్ర వాహనాల చోరీ:ఇద్దరి అరెస్ట్
కీసర, సెప్టెంబర్ 30: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరిని ఆదివారం కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. విలేఖరుల సమావేశంలో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ మాట్లాడుతూ నాగారంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అహ్మద్‌గూడ రాజీవ్ గృహకల్పకు చెందిన వినయ్ కుమార్ (22), ఉపేందర్ (25) అనుమానాస్పదంగా కన్పించటంతో అదుపులోకి తీసుకొని విచారించామని పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ గురువారం దివాకర్, కపుల్ ద్విచక్ర వాహనంపై రాజీవ్ గృహకల్ప వైపు వెళ్తుండగా వినయ్ కుమార్, ఉపేందర్ ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి, వారిని కొట్టి వాహనాన్ని, సెల్‌ఫోన్‌ను లాక్కొని పరారయ్యారని వివరించారు. బాధితులు ఫిర్యాదుతో ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకొని, వారివద్ద నుంచి ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో సీఐ ప్రకాశ్ పాల్గొన్నారు.